అప్పు పేరుతో ఆస్తుల వేట.. రాయపర్తిలో ప్రైవేట్ ఫైనాన్స్ ముఠా?
వరంగల్ : అత్యవసర పరిస్థితుల్లో చేతిలో డబ్బుల్లేక, బ్యాంకుల్లో రుణాలు దొరకక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల నిస్సహాయతను కొందరు ప్రైవేట్ ఫైనాన్షియర్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పు కావాలంటే ఆస్తిని తాకట్టు పెట్టడం కాకుండా తమ పేరిట ‘సేల్డీడ్’ రిజిస్ట్రేషన్ చేయాలంటూ షరతులు విధిస్తున్నారని సమాచారం. అప్పు, వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరిగితే కోట్ల విలువైన ఆస్తులను కారుచౌకగా కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాయపర్తి కేంద్రంగా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. ఇదే తరహా వ్యవహారాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై సమగ్ర విచారణ...