ఇల్లంద KGBV లో ఏం జరుగుతోంది.?
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద కస్తూరిబా గాంధీ బాలికల వసతిగృహంలో సిబ్బంది భద్రత ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంటశాలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రమాదాలు జరుగుతున్నా.. వంట పరికరాల నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులు, భద్రతా చర్యలపై తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వంట చేస్తుండగా వేడి నీళ్లు పడి వంట సిబ్బంది నిమ్మనబోయిన విజయలక్ష్మి గాయపడిన ఘటన కలకలం రేపింది. వెంటనే 108కు సమాచారం అందించడంతో ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. *గతంలోనూ మిక్సీ బ్లేడ్‌తో... వంటశాలలో వినియోగించే పరికరాల భద్రతపై గతంలోనూ ఆందోళనలు వ్యక్తమైనట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. మిక్సీతో పనిచేస్తుండగా బ్లేడ్ ఊడిపోయి ఓ సిబ్బంది వేలికి గాయమైన ఘటన...