మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు హైడ్రా కమిషనర్ అభినందనలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారదను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యకలాపాలు, మహిళల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.