మెడికల్ స్థానికతపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన కవిత
హైదరాబాద్: మెడికల్ విద్యార్థుల స్థానికత అంశంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో సంపూర్ణ హక్కులు కల్పించేందుకే రాష్ట్రం సాధించుకున్నామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా రక్షణలను తొలగిస్తోందని ఆమె విమర్శించారు. మెడికల్ సీట్లకు సంబంధించి స్థానికత నిబంధనల్లో మార్పుల కారణంగా తెలంగాణ విద్యార్థుల కంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం కలిగే పరిస్థితి ఏర్పడుతోందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సరిదిద్దాల్సిందిపోయి సుప్రీంకోర్టులో తన నిర్ణయాన్ని సమర్థిస్తోందని ఆరోపించారు. గతంలో జారీ చేసిన జీఓ 33ను మరింత విస్తరిస్తూ జీఓ...