గడ్డి మందుపై ఎంపీ కావ్య పోరాటానికి ఫలితం

వరంగల్‌: పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ (గడ్డి మందు)పై వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య లోక్‌సభలో లేవనెత్తిన అంశానికి కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్చి 27న ఆమె లోక్‌సభలో ఈ రసాయనంపై దేశవ్యాప్త నిషేధం కోరారు. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ తీసుకున్న నిర్ణయంతో పారాక్వాట్‌ డైక్లోరైడ్‌కు కొత్త రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇప్పటికే మంజూరైన రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేసినట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది. కేంద్ర నిర్ణయానికి ఎంపీ కావ్య కృతజ్ఞతలు తెలిపారు.