నిధుల అక్రమాలపై ఐటీ దాడులు.. 12 ప్రాంతాల్లో సోదాలు

ముంబై: నిధుల అక్రమ లావాదేవీలపై అనుమానాలతో ముంబై ఆదాయపు పన్ను శాఖ అధికారులు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నామనే పేరుతో డబ్బులను విదేశాలకు తరలిస్తున్నారనే అనుమానంతో అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా పలు బృందాలు పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, విదేశాలకు జరిగినట్లు అనుమానిస్తున్న నగదు బదిలీల వివరాలను పరిశీలిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గత ఏడాది డిసెంబర్‌లో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చింది. 2025 డిసెంబర్ 19న ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్, వెస్ట్ జోన్...