బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం
హైదరాబాద్: మణికొండకు చెందిన మహిళా వ్యాపారవేత్త మడుగుల దీప్తిరెడ్డి (42) మరణానంతరం అవయవదానం చేసి నలుగురు రోగులకు కొత్త జీవితం ప్రసాదించారు. ఈ నెల 22న మెదడులో రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన ఆమెను వైద్యులు 26న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో భర్త ప్రదీప్‌రెడ్డి, కుటుంబ సభ్యుల సమ్మతితో రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను దానం చేశారు. జీవన్‌దాన్ ఆధ్వర్యంలో అవయవాలను నలుగురు రోగులకు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యుల నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది.