ఎంజీఎం భద్రతపై ఎస్పీఎఫ్ అధికారుల సమీక్ష
వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో భద్రతా చర్యలు, ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీఎఫ్ పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని సందర్శించి భద్రతా పరిస్థితులను పరిశీలించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీఎఫ్ కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ భీమా తదితరులు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.