భార్యను రోకలిబండతో కొట్టి హత్య.. భర్త లొంగుబాటు

హైదరాబాద్‌ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నరేందర్‌, తేజశ్రీ దంపతులు బాగ్‌లింగంపల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశానికి గురైన నరేందర్‌ రోకలిబండతో తేజశ్రీ తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ బృందం ఆధారాలు సేకరించింది. నరేందర్‌ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.