ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి...ఎర్రబెల్లి

పాలకుర్తి: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సెప్టెంబర్‌ 28 నుంచి ప్రారంభమైంది. నవంబర్‌ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత ఉన్న పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్‌ 30న ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ పేర్కొంది.