నవంబర్‌ 6లోగా ఫారమ్‌–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

షాద్‌నగర్‌: మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్ల జాబితాను డీ-నోవో పద్ధతిలో కొత్తగా రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు షాద్‌నగర్‌ ఆర్డీవో, సహాయ ఎన్నికల నమోదు అధికారి ఎన్‌.ఆర్‌. సరిత కార్యాలయ నోటీసు బోర్డులో షెడ్యూల్‌ను ప్రదర్శించారు. 2026 నవంబర్‌ 1 నాటికి కనీసం మూడేళ్ల క్రితం పట్టా పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఫారమ్‌–18 ద్వారా నవంబర్‌ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓటరుగా నమోదైన పట్టభద్రులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌తో పాటు సంబంధిత ఏఈఆర్‌ఓ, తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, డిప్లొమా ధ్రువపత్రం లేదా మార్కుల పట్టిక సమర్పించాలి. పెద్ద సంఖ్యలో...