రెఖ్య నాయక్ తండాకు ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలి

వరంగల్:సంగెం మండలం రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని రేవంత్ రాథోడ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి ఆయన మాట్లాడుతూ 2018లో పునర్విభజన సమయంలో గ్రామసభ, ప్రజాభిప్రాయం లేకుండా సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని పోచమ్మ తండా పంచాయతీలో కలిపారని తెలిపారు. దీంతో తండా ప్రజలు ప్రభుత్వ సేవలు, అభివృద్ధి పనుల కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం తండాకు సంబంధించిన నిధులు వంజరపల్లి పంచాయతీలో జమ లేదా సర్దుబాటు అయినట్లు వెల్లడైందన్నారు. 2018 నుంచి నిధులపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, తండాకు అర్హమైన నిధులను అభివృద్ధికే వినియోగించాలని కోరారు. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు...