ప్రేమ పేరుతో బాలికపై దాడి.. వీడియోలతో బెదిరింపులు
హైదరాబాద్: బేగంపేటలో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలతో ఫరీద్ (20)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల్లో బాలిక నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.