రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 28: తెలంగాణలో కొత్తగా 41 ‘2బీ’ బార్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. క్యూర్‌ పరిధిలో 14 బార్లు, రాష్ట్రంలోని ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మరో 27 బార్లకు లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, జనాభా పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ బార్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై.. అక్టోబర్‌ 12 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకే ప్రాంతానికి ఎక్కువ దరఖాస్తులు వస్తే...