కోయంబత్తూరు: కదులుతున్న కారుపైకి దూకిన హెడ్‌కానిస్టేబుల్

కోయంబత్తూరు: గుట్కా, పొగాకు అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ వేల్మురుగన్ సాహసం చేశారు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నిందితులు కారును వేగంగా నడపగా, ఆయన కారు టాప్‌ను పట్టుకుని సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాడు. బెంగళూరు నుంచి తరలిస్తున్న 300 కిలోల గుట్కా, పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులను పట్టుకునేందుకు హెడ్‌కానిస్టేబుల్ చూపిన ధైర్యసాహసాలను ప్రజలు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.