నేపాల్‌లో హిమపాతం.. ఇద్దరు మృతి

నేపాల్‌లోని 7,126 మీటర్ల హిమ్‌లుంగ్‌ హిమాల్‌ శిఖరం బేస్‌ క్యాంప్‌ వద్ద హిమపాతం సంభవించింది. ఇద్దరు మృతి చెందగా, మరో 10 మంది గల్లంతైనట్లు సమాచారం. నేపాల్ లో వరదల ముప్పు మరువక ముందే ఈ ఘటన జరగడంపై అక్కడ దేశస్థులు కలవర పడుతున్నారు.