గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

గుంటూరు: అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భారత్‌పేట 7వ లైన్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌బీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు మహిళలు, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రెండు కండోమ్‌ ప్యాకెట్లు, ఉపయోగించిన కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పి. సాయిలక్ష్మి అలియాస్‌ అంజలి ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిని అరండల్‌పేట పోలీసులకు అప్పగించి, తదుపరి చర్యలు చేపట్టారు.