PRGTA వరంగల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
హనుమకొండ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 24 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడిగా ఎన్.శివాజీ, ప్రధాన కార్యదర్శిగా డి.కృపాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి.రాజు, టి.వరలక్ష్మి, అదనపు ప్రధాన కార్యదర్శిగా జి.స్వప్న, కార్యదర్శులుగా ఎం.యాదగిరి, కె.రాజు తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని యాజమాన్య గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందన్నారు. కామన్ డైరెక్టరేట్, 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు, హెల్త్ కార్డులు, కేర్‌టేకర్ల నియామకం తదితర డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర...