ఇల్లంద కస్తూర్బా పాఠశాలలో ప్రమాదం..!
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడినీళ్లు పడటంతో వంట మనిషి విజయలక్ష్మికి గాయాలయ్యాయి. వెంటనే తోటి సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.