భగత్‌సింగ్.. 23 ఏళ్ల వయసులోనే చరిత్రను మార్చిన విప్లవ వీరుడు
న్యూఢిల్లీ: వయసు కేవలం 23 ఏళ్లు.. కానీ ఆలోచనలు మాత్రం తరతరాలకు స్ఫూర్తినిచ్చేంత లోతైనవి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ పేరు భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1907 సెప్టెంబర్ 28న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ లయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించిన ఆయన.. చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం, సామాజిక మార్పు, సమానత్వంపై గాఢమైన ఆలోచనలు పెంచుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ పరిధిలో ఉంది. బాల్యంలోనే స్వాతంత్ర్య భావాలు.. భగత్‌సింగ్ కుటుంబానికే స్వాతంత్ర్య ఉద్యమంతో అనుబంధం ఉంది. తండ్రి కిషన్‌సింగ్, తల్లి విద్యావతి ప్రభావం ఆయనపై పడింది. 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్...