వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురు అదుపులో
గుంటూరు: అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, ఎస్‌బీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. భారత్‌పేట 7వ లైన్‌లో నిర్వహించిన దాడిలో నలుగురు మహిళలు, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు సెల్‌ఫోన్లు, రెండు కండోమ్ ప్యాకెట్లు, ఉపయోగించిన కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గోరంట్లకు చెందిన పి.సాయి లక్ష్మి అలియాస్ అంజలి నిర్వాహకురాలిగా వ్యవహరిస్తూ వాట్సాప్ ద్వారా యువతుల ఫొటోలు పంపిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.