ఒడిశా గ్రామం నుంచి.. తొలి ట్రాన్స్‌జెండర్ సివిల్ సర్వెంట్‌గా!

ఒడిశాలోని చిన్న గ్రామం కనాబగిరి నుంచి వచ్చిన ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్‌ దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ సివిల్ సర్వెంట్‌గా గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుంచే లింగ గుర్తింపు కారణంగా పాఠశాలలో విమర్శలు, వివక్ష ఎదురైనా చదువును కొనసాగించారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీతో పాటు ఐఐఎంసీలో ఇంగ్లిష్ జర్నలిజం చదివారు. 2010లో ఒడిశా ఫైనాన్షియల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సేవలో చేరారు. ఆమె ప్రస్థానం ట్రాన్స్‌జెండర్ సమాజానికి ప్రేరణగా నిలుస్తోంది.