కేసీఆర్ పాత్ర స్టిల్స్ విడుదల.. ప్రియదర్శి ‘ప్యారడైజ్‌ టేల్స్’!

హైదరాబాద్: నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రంలో నటుడు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే ‘శంకరన్న’ పాత్రకు సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ను ఆయన తాజాగా సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఈ పాత్ర లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, తెలంగాణ యాస మాజీ సీఎం కేసీఆర్‌ను పోలి ఉండటంతో సినిమా విడుదలకు ముందే ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రియదర్శి ‘ది ప్యారడైజ్‌ టేల్స్‌’ పేరుతో సెట్స్‌లోని ఫొటోలను పంచుకున్నారు. స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.