24 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. సింధు అసంతృప్తి!
నాగోయా: ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. చైనా స్టార్ చెన్ యుఫెయ్ చేతిలో 21-11, 18-21, 10-21తో ఓటమిపాలైంది. అయితే మ్యాచ్ అనంతరం సింధు ఆటగాళ్లకు ఇచ్చిన విశ్రాంతి సమయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. శనివారం రెండు మ్యాచ్‌లు ఆడిన ఆమె రెండో మ్యాచ్‌ను అర్ధరాత్రి దాటిన తర్వాత ముగించింది. ఆదివారం క్వార్టర్ ఫైనల్ ఆడటంతో 24 గంటల్లోనే మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చిందని తెలిపింది. ఇలాంటి షెడ్యూల్‌లో శారీరకంగా కోలుకోవడం కష్టమని, తాము రోబోలు కాదని వ్యాఖ్యానించింది. మరోవైపు క్వార్టర్ ఫైనల్ జరిగిన కోర్టులో హాక్-ఐ కెమెరా లేకపోవడంపైనా సింధు అసంతృప్తి వ్యక్తం...