అక్రమ షెడ్డు తొలగింపులో అధికారుల నిర్లక్ష్యం!

వరంగల్‌: 41వ డివిజన్‌ పోచమ్మగుడి కాలనీలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్డు తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. సెప్టెంబర్‌ 7న కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. కేవలం మట్టి పోసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. షెడ్డు తొలగించి శాశ్వత రోడ్డు నిర్మించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.