వక్ఫ్ హక్ బచావో తహ్రీక్ జేఏసీ చైర్మన్‌గా ఖాలిఖ్ తన్వీర్
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వక్ఫ్ & హక్ బచావో తహ్రీక్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్‌గా ఎం.ఏ. ఖాలిఖ్ తన్వీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు, వక్ఫ్ & హక్ బచావో తహ్రీక్ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ అబ్దుల్ వాహబ్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా మైనారిటీల సమన్వయ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా చూడాలని అన్నారు. ఆస్తుల రికార్డుల పరిరక్షణ, ఆక్రమణలు, వివాదాలపై చట్టపరమైన చర్యలతో పాటు వాటిని చట్టబద్ధంగా అభివృద్ధి చేసి విద్య, ఆరోగ్యం,...