గంగాదేవిపల్లిని సందర్శించిన ఏఎస్‌సీఐ విద్యార్థుల బృందం
గీసుకొండ : హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) విద్యార్థుల బృందం ఆదివారం జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా గుర్తింపు పొందిన గంగాదేవిపల్లిని సందర్శించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ కలెక్టివ్ మేనేజ్‌మెంట్ కోర్సులో భాగంగా గ్రామాభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించారు. పంచాయతీ పాలకమండలి, సబ్‌కమిటీల పనితీరు, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటైన కమ్యూనిటీ వాటర్ ప్లాంట్, శిక్షణ కేంద్రం, మహిళా సంఘాల పాత్ర, స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘం పనితీరును పరిశీలించారు. మహిళలు నిర్వహిస్తున్న పల్లినూనె మిల్లు, బుట్టల తయారీ, టీ దుకాణం, కూరగాయల దుకాణం, డెయిరీ ఫామ్, సిమెంట్–ఐరన్ షాప్‌తో పాటు ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను...