కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది: రావు పద్మారెడ్డి
హనుమకొండ: రాబోయే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ నాయకురాలు రావు పద్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, 59వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో బీజేపీ కార్యకర్తలపై, మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని రావు పద్మారెడ్డి ఆరోపించారు. 59వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారని, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను కూడా తమ ఖాతాలో...