మన్ కీ బాత్ శక్తివంతమైన వేదిక: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ పరిధిలోని గౌతమ్‌నగర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్యుల విజయాలు, ఆవిష్కరణలను దేశ ప్రజలకు పరిచయం చేస్తూ వారిని ఏకం చేసే వేదికగా ‘మన్ కీ బాత్’ నిలుస్తోందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దాదాపు 25 ఏళ్లుగా మోదీ ప్రజా సేవకు అంకితమై పనిచేస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నిరంతర శ్రమ, అంకితభావం ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.