బీఆర్‌ఎస్‌పై అద్దంకి దయాకర్ విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరుల త్యాగాలని, కేసీఆర్‌ కుటుంబం కాదని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ అన్నారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నేతలు గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా భూములు ఆక్రమించి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కోట్ల రూపాయల విలువైన భూములు విముక్తి అవుతున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌లో కాంగ్రెస్‌ బలోపేతంపై దృష్టి సారిస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి...