అక్టోబరు 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు!
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అధికమాసం వచ్చిన సందర్భాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు. అక్టోబరు 11న రాత్రి 7 గంటలకు అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12న బంగారు తిరుచ్చి, పెద్దశేష వాహన సేవలు, 13న చిన్నశేష, హంస వాహనాలు, 14న సింహ, ముత్యపుపందిరి, 15న కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు జరుగుతాయి. 16న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 17న హనుమంత వాహనం, సాయంత్రం 4...