శంషాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కారు దగ్ధం!

శంషాబాద్‌: హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. చూస్తుండగానే మంటలు భారీగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ లేదా ఇంజిన్‌ వేడెక్కడంతో మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.