పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల కేంద్రాలు, రోడ్లకు బిగ్ పుష్
హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. 5,118 గ్రామ పంచాయతీల సొంత భవనాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు మంజూరు చేయగా.. 3,269 భవనాల పనులు 70 శాతానికి పైగా పూర్తయ్యాయని తెలిపారు. 8 వేల గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల కేంద్రాల ఏర్పాటుకు మరో రూ.800 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ రహదారుల కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM) ద్వారా రూ.3,382 కోట్లతో 3,861 కి.మీ. పక్కా రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.