వేలిముద్రలు, ఐరిస్‌ ఒకేలా.. డూప్లికేట్‌గా గుర్తించిన సిస్టమ్‌

రాంపూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన పదో తరగతి కవలలు ఖిజ్రా జుబేర్‌, తూబా జుబేర్‌ల బయోమెట్రిక్‌ వివరాలు ఆధార్‌ వ్యవస్థకు సవాలుగా మారాయి. ఇద్దరి వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్లు ఒకేలా సరిపోవడంతో ఒకరి ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ పూర్తయ్యాక మరొకరి దరఖాస్తును సిస్టమ్‌ డూప్లికేట్‌గా తిరస్కరించింది. దీంతో కుటుంబం జిల్లా డీఎంను ఆశ్రయించింది. యూఐడీఏఐ అధికారులు ప్రత్యేక సాంకేతిక పరిశీలన, మాన్యువల్‌ వెరిఫికేషన్‌ చేపట్టి మూడు–నాలుగు నెలల తర్వాత ఇద్దరికీ వేర్వేరు ఆధార్‌ గుర్తింపులను కేటాయించారు.