కొత్త 3వ ప్లాట్ఫారంపై తొలిసారి గోల్కొండ ఎక్స్ప్రెస్ హాల్ట్
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వే స్టేషన్లో మూడో రైల్వే లైన్ పనులు పూర్తికావడంతో నూతన 3వ ప్లాట్ఫారం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాట్ఫారంపై తొలిసారిగా గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ అయ్యింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న రైలు సాయంత్రం 5:14 గంటలకు కొత్త ప్లాట్ఫారంపై ఆగింది. మూడో లైన్ ఏర్పాటు అనంతరం ఇదే తొలి రైలు హాల్ట్ కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.