పాముకాటుతో ఆరు నెలల బాబు మృతి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈక తిరుపతి–స్వప్న దంపతుల ఆరు నెలల కుమారుడు మంచంలో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. పాము అక్కడి నుంచి వెళ్తుండగా తల్లి గుర్తించినట్లు సమాచారం. 108 అంబులెన్స్ కోసం వేచి చూసిన అనంతరం బాబును దంపతులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.