ప్రెస్ స్టిక్కర్‌తో గుడుంబా దందా.. పోలీసుల తనిఖీల్లో పట్టివేత
సూర్యాపేట: తిరుమలగిరి మండలం వెలిశాల క్రాస్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ప్రెస్ స్టిక్కర్ ఉన్న బుల్లెట్ వాహనంపై తరలిస్తున్న 10 గుడుంబా బాటిళ్లు పట్టుబడ్డాయి. తనిఖీల్లో జాటోత్ భద్రు నాయక్ వద్ద గుడుంబా బాటిళ్లు గుర్తించిన పోలీసులు వాటితో పాటు బుల్లెట్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంపై ప్రెస్ స్టిక్కర్ ఉండటంతో పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. గుడుంబాను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రెస్ స్టిక్కర్లను అడ్డం పెట్టుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.