కన్నాయిగూడెంలో బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద షార్ట్ సర్క్యూట్

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద ఆదివారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. టవర్ ఆవరణలోని కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. టవర్‌కు జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి ఉండటం, అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇతర నెట్‌వర్క్‌లు సరిగా పనిచేయకపోవడంతో ఈ బీఎస్ఎన్ఎల్ టవర్ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కీలకంగా ఉందని వారు పేర్కొన్నారు.