ప్రజాస్వామ్యాన్ని ఓటు చోరీతో అపహాస్యం చేస్తున్నారు: రాయపురం సాంబయ్య
వరంగల్: ప్రజాస్వామ్యాన్ని ఓటు చోరీ ద్వారా అపహాస్యం చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య ఆరోపించారు. ఆదివారం వరంగల్ శివనగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సాంబయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, బీజేపీ నేతలపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.