ఎస్టీ సర్టిఫికెట్‌ ఉన్నా.. రిజర్వేషన్‌ రద్దు!

హైదరాబాద్‌: తెలంగాణ ఎస్టీ రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందేందుకు అర్హత లేదని గిరిజన సంక్షేమ శాఖ తేల్చడంతో 37 మంది అభ్యర్థులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎస్టీ కేటగిరీ నుంచి తొలగించింది. సెప్టెంబర్‌ 22న గిరిజన సంక్షేమ శాఖ పంపిన జాబితా ఆధారంగా ఈ చర్య తీసుకుంది. వీరిలో కొందరి కుటుంబాలు కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస వచ్చినట్లు పరిశీలనలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. అసలు చిక్కు ఇదే.. సంబంధిత అభ్యర్థుల వద్ద తెలంగాణలో జారీ చేసిన ఎస్టీ ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ.. కుటుంబ మూలాలు, గత నివాస ప్రాంతం, వలస నేపథ్యం, రాష్ట్ర ఎస్టీ రిజర్వేషన్‌ నిబంధనలను పరిశీలించిన...