మలక్కపేట ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
రేగొండ: మండల సమీపంలోని మలక్కపేట గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగినట్లు సమాచారం. గుర్తుతెలియని దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుండీల్లోని నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.