బాధిత కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అండ
రాయపర్తి: రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన వల్లాల లక్ష్మి కుటుంబాన్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో లక్ష్మి మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫౌండేషన్ తరఫున 50 కిలోల బియ్యం, ఆయిల్ క్యాన్ అందించి ఆర్థికంగా అండగా నిలిచారు. కార్యక్రమంలో కొండూరు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.