ఎస్ఐఆర్ నోటీసులకు స్పందనపై ఆసక్తి తగ్గిందా?
హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వారిలో గణనీయ సంఖ్యలో ఓటర్లు విచారణలకు హాజరుకాకపోవడం అధికారులకు సవాల్‌గా మారింది. ఎస్ఐఆర్లో ప్రతి ఓటు వివరాలను పరిశీలించి తుది జాబితాను రూపొందించాలని ఎన్నికల సంఘం కిందిస్థాయి అధికారులను ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారితో పాటు నోటీసులు రాని ఓటర్ల వివరాలు, ఫొటోలు, అభ్యంతరాలు తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మందికి పైగా ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలు అందినట్లు అధికారిక ప్రక్రియలో వెల్లడైంది. మిగిలిన వారిలో గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల...