ఉమ్మడి వరంగల్‌లో నాలుగు ప్రాంతాలకు కొత్త 2బీ బార్లు!
తెలంగాణలో కొత్తగా 41 2బీ బార్ల ఏర్పాటుకు ప్రీ-క్లియరెన్స్ మంజూరు కోసం ఎక్సైజ్ శాఖ ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కేసముద్రం, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సంపేట, ములుగు ప్రాంతాలు ఉన్నాయి. ప్రీ-క్లియరెన్స్ కోసం దరఖాస్తు రుసుము రూ.1 లక్షగా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 12, 2026. ఆసక్తి ఉన్నవారు తెలంగాణ ఎక్సైజ్ అధికారిక పోర్టల్� ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.