కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. పర్యాటక సిరి మన దేశం!

న్యూఢిల్లీ: మంచుకొండలు.. సముద్ర తీరాలు.. ఎడారులు.. దట్టమైన అడవులు.. చారిత్రక కోటలు.. అద్భుతమైన దేవాలయాలు.. బౌద్ధ క్షేత్రాలు.. గిరిజన సంస్కృతి.. నదులు, జలపాతాలు.. ఇలా ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత, సంస్కృతి కలగలిసిన పర్యాటక సంపద భారతదేశానికి ప్రత్యేకత. సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దేశ పర్యాటక వైభవంపై మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉత్తర భారతదేశంలో హిమాలయాలు ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని లోయలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు పర్వతాలు, ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ క్షేత్రాలు ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్రాలుగా ఉన్నాయి. లడఖ్‌ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాలు, సరస్సులు, బౌద్ధ మఠాలు సాహస పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రాజస్థాన్‌ కోటలు, రాజభవనాలు, ఎడారి...