ప్రపంచ చరిత్రలో తెలంగాణ పర్యాటక వైభవం!

హైదరాబాద్: చరిత్రను చెబుతున్న కోటలు.. కాకతీయుల శిల్పకళను చాటే ఆలయాలు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. కనువిందు చేసే జలపాతాలు.. దట్టమైన అడవులు.. వన్యప్రాణుల అభయారణ్యాలు.. సరస్సులు.. గిరిజన సంస్కృతి.. హస్తకళలు.. ఇలా విభిన్న అనుభవాలను అందించే పర్యాటక సంపద తెలంగాణ సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక వైభవంపై మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పర్యాటకానికి హైదరాబాద్ ప్రత్యేక ముఖద్వారం. చార్మినార్, గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్ గత వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. హుస్సేన్‌సాగర్, నగరంలోని మ్యూజియంలు, సాంస్కృతిక ప్రదేశాలు నగర పర్యాటకానికి మరింత ఆకర్షణను తీసుకొస్తున్నాయి. కాకతీయుల వారసత్వానికి వరంగల్, హనుమకొండ...