తెలంగాణ నయాగారంగా బొగత.. జలసిరులతో కనువిందు!
ములుగు: దట్టమైన అడవులు.. ఎత్తైన కొండలు.. రాళ్ల మధ్య నుంచి జాలువారే జలధారలు.. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే అందమైన ప్రాంతం బొగత జలపాతం. ములుగు జిల్లాలోని ఈ జలపాతాన్ని తెలంగాణ టూరిజం ‘తెలంగాణ నయాగరా’గా పేర్కొంటోంది. రాష్ట్రంలోని ప్రముఖ జలపాతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన బొగత ప్రకృతి, సాహస పర్యాటకానికి అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. వర్షాకాలంలో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. జలపాతం చుట్టూ ఉన్న రాతి కొండలు, పచ్చని అడవులు ప్రకృతి సోయగాన్ని మరింత పెంచుతాయి. కొంతదూరం కాలినడకన వెళ్లాల్సి ఉండటంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రకృతి మధ్య నడక, సాహస అనుభూతి లభిస్తుంది. వర్షాకాలం అనంతరం జలపాతం మరింత అందంగా...