కోటలు.. కోవెలలు.. కొండలు.. జలపాతాలు!

వరంగల్: చరిత్రకు సాక్ష్యంగా నిలిచే కోటలు.. కాకతీయుల శిల్పకళను చాటే ఆలయాలు.. అడవుల్లో కనువిందు చేసే జలపాతాలు.. ప్రకృతి ఒడిలో అలరించే సరస్సులు.. ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు.. ఇవన్నీ కలగలిసిన ప్రాంతమే ఉమ్మడి వరంగల్ జిల్లా. నేటి వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో పర్యాటకంగా అపారమైన అవకాశాలు ఉన్నాయి. వరంగల్ నగరం కాకతీయుల రాజధానిగా విలసిల్లిన చారిత్రక నగరం. వరంగల్ కోట, కాకతీయ కీర్తి తోరణం, వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయం వంటి ప్రాంతాలు చరిత్రాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాకతీయుల నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ఈ కట్టడాలు నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. ములుగు జిల్లా పర్యాటకానికి...