ప్రపంచ పర్యాటక పటంలో రామప్ప!

ములుగు: కాకతీయుల అద్భుత శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం రామప్ప దేవాలయం. పాలంపేటలోని ఈ రుద్రేశ్వరాలయం శతాబ్దాలుగా చరిత్ర, శిల్పకళాభిమానులను ఆకట్టుకుంటున్నా.. ఒకప్పుడు దేశవ్యాప్తంగా అంతగా ప్రచారం లేని పర్యాటక ప్రదేశంగా ఉండేది. 2021 జూలై 25న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో రామప్ప దేవాలయం చేరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. యునెస్కో గుర్తింపుకు ముందు కూడా రామప్పకు పర్యాటకుల రాక ఉండేది. యునెస్కో పరిశీలన నివేదిక ప్రకారం అప్పట్లో ఏడాదికి సుమారు 2 లక్షల మంది ఆలయాన్ని సందర్శించేవారు. అయితే ప్రపంచ వారసత్వ గుర్తింపు అనంతరం సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అప్పట్లోనే అంచనా వేసి, సందర్శకుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను...