రైల్వే విద్యుదీకరణలో భారత్ మరో మైలురాయి
హైదరాబాద్: భారత రైల్వే విద్యుదీకరణలో మరో కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా రైల్వే మార్గాల్లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రైలు రవాణాలో డీజిల్పై ఆధారపడటం తగ్గడంతో పాటు ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గించే దిశగా పురోగతి సాధించినట్లు పేర్కొంది. రైల్వే మౌలిక వసతుల ఆధునికీకరణలో విద్యుదీకరణ కీలక భాగంగా మారింది. మిగిలిన మార్గాల విద్యుదీకరణ పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.